24 గంటల్లోనే చైన్ స్నాచర్‌ను అరెస్ట్ చేసిన నందిపేట్ పోలీసులు

  నందిపేట్, బతుకమ్మ :   నందిపేట్ మండల పరిధిలోని బజార్ కొత్తూరు గ్రామ శివారులో మహిళ మెడలో నుంచి బంగారు చైన్ అపహరించిన నిందితుడిని నందిపేట్ పోలీసులు 24 గంటలు గడవకముందే అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలానికి చెందిన పిట్ట భోజవ్వ తన అక్క రత్న అనారోగ్యంతో ఉండటంతో ఆమెను పరామర్శించేందుకు ఉమ్మెడ గ్రామానికి వచ్చింది. అనంతరం తిరుగు ప్రయాణంలో మాయాపూర్ అంబేద్కర్ బస్‌స్టాప్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా, అటుగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి తాను...