Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 7:30 pm Posted by : ramakrishna

నమో నారసింహ..

  • నేడు శ్రీవారి రథోత్సవం (జాతర)
  • భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ ధర్మకర్త, అధికారులు
  • ఆరోగ్య కేంద్రం, అంబులెన్స్ ఏర్పాటు
  • పోలీస్ భారీ బందోబస్తు.. ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే ఏర్పాటు

 

భీమ్ గల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లింబాద్రి గుట్ట (నింబచలం)లో నేడు శ్రీవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. క్షేత్రం లో అక్టోబర్ 27 నుండి కొనసాగుతున్న శ్రీలక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవం లో అత్యంత కీలక గట్టమైన రథోత్సవాన్ని జరిపించేందుగు ఆలయ అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రథోత్సవాన్ని తిలకించేందు జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలను తీసుకొంటున్నారు.

Namo Narasimha..

 

  • ఆలయ చరిత్ర..

శతకోటి దేవతలే పచ్చని చెట్లుగా, పరమపూజ్యుల్లే ప్రకృతి అందాలుగా ఉన్న నింబచల క్షేత్రంలో వెలసిన మహాలక్ష్మి సామెత నృసింహుడు భక్తుల కొంగు బంగారంగా విరాజిళ్లుతున్నాడు. గౌతమి నదికి దక్షణ దిశగా రెండు యోజణాల దూరంలో శ్రీ లక్ష్మీనృసింహుని క్షేత్రం నింబచలం, లింబాద్రిగుట్ట గా పేరొందింది. అక్టోబర్ 27న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నవంబర్ 7వరకు కొనసాగానున్నాయి. సంసృత పదాలైన నీమ్, ఆచలం అను రెండు పదాల కలయిక నింబచలం ఈ పేరు మీదుగానే ఉద్భవించింది. నింభచల క్షేత్రం నీమ్ అనగా వేప చెట్టు, ఆచలం ఉద్యమం, జీవితం, కొండ అనే అర్థాలను ఇస్తుంది. స్థల మహిమ కారణంగా దేవతలే ఈకొండ పై వేపచేట్లుగా, పవిత్ర శిలలుగా ఉద్భవించడంతో ఈ కొండకు నింభచలం అనే పేరు వచ్చినట్లు ప్రతీతి.

Namo Narasimha..

 

  • స్థల పురాణం..

నింభచల క్షేత్రంలో సృష్టికర్త బ్రహ్మ దేవుడు, ప్రహ్లాదుడు,వాయుదేవుడు, ఇంద్రుడు తపస్సు చేసారని స్థల పురాణం చెబుతోంది. యామధర్మరాజు సైతం ఈ ప్రాంథంలోనే తపస్సు చేసి శ్రీహరి ఆజ్ఞతోనే క్షేత్రం పై బిల్వ వృక్షంగా వెలిసాడని, అందువల్లే ఈ క్షేత్రంలో మాత్రమే శ్రీన్నారాయణునికి పత్రి సమర్పణ చేయడం జరుగుతుంది. అష్ట దశ పురాణాల్లో ఒక్కటైనా వైవర్ధ పురాణంలో ఈ క్షేత్ర వివరాలు పొందు పరిచబడ్డాయి.బ్రహ్మదేవుడు, ప్రహ్లాద్దుడు చేసిన తపస్సు కు ప్రసన్నుడైనా స్వామి ఈ క్షేత్రం స్వయంగా వెలిశారు. స్వామి వారికి ఎడుమ వైపున అమ్మవారు, శ్రీ మహాలక్ష్మి మరోవైపు నర నారాయణులైన కృష్ణార్జునులు, పరమ వైష్ణవ హనుమాండ్లు స్వయంభూలుగా వేశారు. యావత్ భారత దేశంలో దక్షణ బద్రీనాథ్ తర్వాత ఈ నింభచల క్షేత్రం లోనే నర నారాయణులు స్వయంభూ లుగా వెలిసినట్లు అర్చకులు చెబుతారు. స్వామి వారి గర్భలయం పశ్చిమ భాగంలో ఉన్న జోడు లింగాలను దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరడం తో పాటు పాప వినశానం అవుతుందని చెబుతారు. స్థల పురాణం శ్రీ వశిష్ట మహాముని ద్వారా మందాత మహారాజుకు, శ్రీ వేద వ్యాసుని ద్వారా జనమేయ రాజుకు, మార్కండేయనికి, చంద్రగుప్తా మహారాజులకు కథలుగా భోదించినట్లు ప్రసిద్ధి.

Namo Narasimha..

  • ఆరోగ్య శాఖ వారి ఆరోగ్య కేంద్రం ఏర్పాటు..

శ్రీవారి జాతర, రథోత్సవానికి వచ్చి పోయే భక్తుల సౌకర్యార్థం జిల్లా ఆరోగ్య శాఖ వారు కొండ పై ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమయ్యే మందులు ఇస్తారు. అత్యవసర కేసులకు ఈ కేంద్రంలో ప్రథమ చికిత్స నిర్వహించి రోగిని హైయర్ సెంటర్ కు తరలించెందుకు అంబులెన్సు ను ఏర్పాటు చేశారు.ఈ కేంద్రంలో చికిత్స నిర్వహించేందు వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించారు.  అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఫైర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఫైర్ ఇంజన్ ను అందుబాటులో ఉంచారు.

Namo Narasimha..

  • జాతరకు భారీ పోలీస్ బందోబస్త్..

నేడు లింబాద్రి గుట్టపై జరగనున్న శ్రీ వారి రథోత్సవము (జాతర) కు పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, భీంగల్ సీఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బందో బస్తు ఏర్పాటు చేశారు. జాతర కు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ఇబ్బంది ని దృష్టిలో ఉంచుకుని ఈసారి భక్తులకు, జాతరకు వచ్చే వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. అందుకొరకు ముందుగా క్షేత్రాన్ని ఏసీపీ, సీఐ ఆధ్వర్యంలో గత మూడు, నాలుగు రోజులుగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించారు. జాతరకు వచ్చే భక్తులకు పార్కింగ్, వీఐపీ పార్కింగ్, ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. జాతరలో ఎక్కడ కూడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అందుకొరకు ముగ్గురు ఏసీపీ ల ఆధ్వర్యంలో పది మంది సీఐ లు, 30 మంది ఎస్సై ల పర్యవేక్షణలో సుమారు 400 మంది సివిల్, విమెన్ పోలీసులు జాతర బందో బస్తు కొరకు ఏర్పాటు చేశారు. జాతర కు వచ్చే భక్తుల కొరకు పోలీస్ కంట్రోల్ రూం లు ఏర్పాటు చేశారు. జాతర లో దొంగతనాలు, ఇతర కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు కొందరు పోలీసులను ప్రధాన కూడళ్ళలో మఫ్టీలో నియమించడం జరిగిందని సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Namo Narasimha..

  • నేడు వన్ వే..

జాతర కు వచ్చే భక్తుల రద్దీ ని దృష్టిలో ఉంచుకుని నేడు వన్ వే ఏర్పాటు చేయడం జరిగిందని సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. జాతర కు వచ్చే వాహనాలు భీంగల్, బాబాపూర్ మీదుగా గుట్టకు వెళ్లాల్సి ఉంటుంది. జాతర ముగుంచుకుని వెల్లే వారు లింగాపూర్, పల్లికొండ, బాచన్పల్లి, పిప్రి మీదుగా వారి వారి గమ్య స్థానాలకు చేరుకోవాల్సి ఉంటుందని సీఐ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు వన్ వే ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు సహకరించాలని సీఐ కోరారు.

Namo Narasimha..

  • మున్సిపల్ ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు పూర్తి..

లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా  భీంగల్ మున్సిపల్ ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు చేపట్టారు. నేడు రథోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్  సాకారంతో జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా బయో టాయిలెట్ల బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ గోపు గంగాధర్ ఆధ్వర్యంలో శానిటేషన్ పనుల పూర్తి చేశారు. గుట్టపైన స్లీపింగ్, చెత్త క్లీనింగ్,  బ్లీచింగ్ పౌడర్ చల్లడం  వంటి కార్యక్రమాలు శానిటేషన్ వర్క్ లతో చేయడం జరిగింది. శానిటేషన్ పనులను కమిషనర్ పరిశీలించారు.

Namo Narasimha..