Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 9:26 pm Posted by : ramakrishna

అధికారిక వ్యవస్థలన్ని విఫలమైన చోట చీకట్లో చిరు దీపం అయిన “నాల్సా” ?

 

. . . నీటిపారుదల శాఖ నీటి పాలైంది

 

. . . రెవిన్యూ శాఖ రాటుదేలి పోయింది

 

. . . కార్మిక శాఖ కాటగలిసి పోయింది

 

. . . పోలీసులు శాఖ కేసుల నమోదుతోనే పొద్దు పోతోంది

 

. . . నిఘా విభాగాలన్ని మొద్దు నిద్దరోతున్నాయి

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

అధికారిక వ్యవస్థలకు బలం ఉన్నది  బలగాలు ఉన్నాయి. కానీ అన్యాయాలను  అక్రమాలను అరికట్టాలన్న బలమైన సంకల్పం లేకపాయె. నీటిపారుదల శాఖ తన పరిధిలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ బాగానా మట్టిని వందలాది ట్రాక్టర్లతో తవ్వుకొని పోతున్న నీరు పల్లమెరుగు అన్న సామెతగా ఎగువన ఏమైతేనేమి ప్రాజెక్టు నీరంతా పల్లానికి పరుగులు తీస్తున్నది కదా మాకెందుకు అనుకున్నారేమో. మట్టిని తవ్వుకుని పోతున్న పట్టించుకోలేదు. అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ ప్రతి గ్రామంలో తనకంటూ సిబ్బంది ఉంటారు. ఊ.. అంటే ఊర్ల నుండి సమాచారం చిటికెలో వస్తుంది. ఇటుక బట్టీల భూ స్థలం వారికి వస్తుందో  ప్రైవేట్ వ్యక్తులదో కనిపెట్టలేకపోయింది. లేక కనికట్టు ఏమైనా ఉన్నదో ఇటుకలు తయారు చేస్తున్న భూముల …భూమాతకే ఎరుక. కార్మిక శాఖ ఎక్కడెక్కడ ఏయే రంగాలలో ఎంతేంత మంది కార్మికులు పని చేస్తున్నారు. రోజువారీ కూలీ ఎంత. వారి జీవన స్థితిగతులు ఏమిటి. పని ప్రదేశాల్లో భద్రత ఎంత. అనారోగ్యం పాలైతే ప్రాణాలు ఎట్లా కాపాడాలే అనే సోయి లేకపోయే. కార్మికుల కష్టాలకు ఖరీదు కట్టాల్సిన కార్మిక శాఖనే కాలు కదిలించక పాయె. కార్మికుల దిక్కు చూడక పోయే. చీమ చిటుక్కుమన్న సమాచారం తీసుకునే పోలీసు శాఖ ఏం ఏం తీసుకుంటున్నదో. ప్రతి పోలీస్ స్టేషన్ లో పోలీస్ డ్రెస్ లో ఉండే పోలీసులతో పాటు సివిల్ డ్రెస్ లో ఉండి ప్రతి గ్రామం నుండి గల్లీ నుండి ఆయా గ్రామాలలో మంచి చెడుల సమాచారం వేగుల ద్వారా సేకరించుకుంటాది. కాని వేగులంతా గుర్రుకొట్టుకుంట నిద్దరోతున్నారేమో. ఇగ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా గుడాచారి విభాగాలు ఉంటాయి. ఇవి కూడా ప్రజల ప్రతి కదలికలను మొత్తంగా సమాజంలోని సమాచారాన్ని గుడిగుచ్చి పోలీసు బాసులకు అందించడమే గుడాచారుల విధులు.

 

"NALSA", a small lamp in the darkness where all official systems have failed?

 

ఇంత పెద్ద వ్యవస్థలు దేగం ఇటుక బట్టీల బాగోతాన్ని పసిగట్ట లేక పోవడమే ఒక వింతల్లోకెళ్ళ వింత. తనకంటూ ఒక గుడాచార వ్యవస్థ లేదు. పెద్ద బలగము లేదు.అయిన దేగం ఇటుక బట్టీల కార్మికుల చీకటి బతుకుల్లో చిరు దీపంలా వెలిగింది నాల్సా అదే జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ. సంస్థలకు జడ్జిలే చైర్మన్ లుగా మహిళ జడ్జిలే చైర్ పర్సన్ లుగా ఉండి అదనపు బాధ్యతల బరువులు మోస్తారు.న్యాయసేవల అధికార సంస్థల చట్టం 1987 ప్రకారమే జాతీయ రాష్ట్ర జిల్లా. మండల స్థాయిలలో ఏర్పాట్లు చేశారు. బడుగు బలహీన వర్గాలకు మహిళలకు ఉచిత న్యాయసేవలు అందిచడమే పరమావధిగా ఏర్పాడింది. రాను రాను ప్రజల అవసరాలరీత్యా తనను తాను విస్తరించుకుంటూ న్యాయసేవలను ఇస్తరాకుల్లో పంచుకుంటూ పోతున్నది.అవసరం అయినప్పుడల్ల న్యాయార్థులకు అందడండగా ఉంటున్నది.జడ్జిలు నల్లకోటు నల్ల గౌను వైట్ టై వేసుకుని నాలుగు గోడల మధ్య ఉండే వారిని న్యాయసేవల చట్టం ప్రజల మధ్యకు పోవాలని తమకు తోచిన సామాజిక సేవలు చేయాలని పూరమాయించింది.ఎట్లా తెలుసుకున్నదో ఏమో న్యాయవ్యవస్థ పై వ్యవస్థలను కలుపుని కార్మికుల వైపు కదిలింది కదిలించింది. కార్మికుల చీకటి బతుకుల్లో దారి దీపమై దారి జూపింది.

 

"NALSA", a small lamp in the darkness where all official systems have failed?

 

నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవిఎన్ భారత లక్ష్మీ కాగాడా పట్టుకుని కాంతి రేఖగా కదిలింది. చట్టాలు మన చుట్టాలు అవుతాయని వాటిని పెడ చెవిన పెడితే చెవులు పిండుతాయని ఎరుక జేసింది.ఒక కదలిక లక్ష మేదళ్లకు కదలిక అన్నారు ఒక కవి నిన్నటి దేగం ఇటుక బట్టీల కార్మికుల కన్నీటి కథలకు చట్టాలతో ఫుల్ స్టాప్ పెట్టారు ఆమె. ఆర్మూర్ లోని పునరావాస కేంద్రంలో ఉన్న కార్మికులను కదిలిస్తే కనిపించే కన్నీటి చుక్కలు ఎన్నో కనిపించని శరీరక మానసిక గాయలెన్నో. పిల్ల పాపలతో వందలాది కిలోమీటర్ల దూరం నుండి వచ్చి బుక్కెడు బువ్వ కోసం కార్మికులు పడిన కష్టాలెన్నో. ఆ బక్క శరీరాలను కదిలిస్తే బొక్కల చప్పుడు  శరీరపు తోలు చప్పుడు తప్ప మరింకేమి వినబడదు కనబడదు. ఒక స్వాంతన దొరికింది నాల్సా తలాపున అనే ఓదార్పు. జయహో నాల్సా జయహో అనే నినాదమే. జనం నోటి నుండి మెల్ల మెల్లగా వినబడుతూ పెద్ద రాగమే అవుతున్నది. ఆ రాగానికి పెద్ద బండరాళ్లు కరిగిపోవా. న్యాయం అందరికి అదుబాటులో ఉండాలి నాల్సా  నినాదమే నిజమైన వేళ.

 

"NALSA", a small lamp in the darkness where all official systems have failed?