ప్రజా భవన్‌లో వైభవంగా నల్లపోచమ్మ బోనాల వేడుకలు
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పురస్కరించుకుని ఆదివారం ప్రజా భవన్‌లో నల్లపోచమ్మ అమ్మవారి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య జరిగిన ఈ వేడుకలకు విశేష ప్రాధాన్యత లభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి...