ఘనంగా ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి
కామారెడ్డి, బతుకమ్మ : రిజర్వేషన్ డే సందర్భంగా సామాజిక న్యాయం, విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అమలుకు పునాది వేసిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలను ఆదివారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, భారతదేశంలో సామాజిక సమానత్వం సాధనకు, విద్యా అవకాశాల విస్తరణకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన...