- రెండో ప్రాధన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభం
నల్గొండ, బతుకమ్మ: నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైయింది. గెలుపు కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. చెల్లుబాటు అయిన ఓట్లు 23641 కాగా చెల్లని ఓట్లు 494 గా గుర్తించారు. గెలుపు కోటా ఓట్లు 11,822 గా అధికారులు నిర్దారించారు. పిఆర్ టియు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి -6035, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి-4820, హర్షవర్ధన్ రెడ్డి కి4437, పూల రవీందర్-3115, పులి సరోత్తం రెడ్డి-2289 ఓట్లు వచ్చాయి.
ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12 మంది పోటీ అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు.