Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 10:54 pm Posted by : ramakrishna

నాయబ్ తహసీల్దార్లు బదిలీ

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని వివిధ మండలాల్లోని నాయబ్ తహసీల్దార్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలోని వివిధ మండలాల్లో నాయబ్ తహసీల్దార్ లుగా విధులు నిర్వహిస్తున్న వి.గంగాదర్, తెలంగారావు, ప్రకాష్, బాబు సింగ్ లను నిర్మల్ జిల్లాకు బదిలీ చేశారు. హరీష్ కుమార్, విష్ణు వర్ధన్, కె.పద్మలను జగిత్యాల్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆదిలాబాద్ లో విధులు నిర్వహిస్తున్న విజయ్ కాంత్ రావును నిజామాబాద్ కు, నిర్మల్ లో విధులు నిర్వహిస్తున్న అబ్దల్ అజీజ్, దీప రాణి, రంజిత్ కుమార్, మునీరుద్దీన్ లను నిజామాబాద్ కు బదిలీ చేశారు. జగిత్యాల జిల్లాలో విధులు నిర్వహిస్తున్నఖాజా అబ్దుల్ మజీద్, బి.రాజ శేఖర్, కార్తీక్ రెడ్డి, వినోద్ కుమార్ లను నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.