ఘనంగా నాగుల పంచమి వేడుకలు
బతుకమ్మ, బోధన్: మండల కేంద్రంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాలల్లో నాగుల పంచమి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. నాగుల పంచమిని పురస్కరించుకొని ఏక చక్ర నగర్ సంతాన నాగమ్మ ఆలయం వద్ద గల నాగమ్మ ఆలయంలో మహిళలు పాము పుట్టలో పాలు పోసి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగమ్మ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ పూజారి మహిళలు తదితరులు పాల్గొన్నారు.