Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 8:26 pm Posted by : ramakrishna

15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగనాథ్ నామినేషన్.

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

15వ వార్డుకు చెందిన యువ నాయకుడు నాగనాథ్ గురువారం తన మొదటి నామినేషన్ పత్రం దాఖలు చేశారు. పట్టణంలోని మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్బంగా నాగనాథ్ మాట్లాడుతూ 15వ వార్డు సమస్యలపై అవగాహన ఉందని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.