Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 9:46 pm Posted by : ramakrishna

నాగిరెడ్డిపేట్ మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి స్టైలే వేరు

  • మహిళా ఉపాధ్యాయినిలను కించపరిచే విధంగా ఎంఈఓ ప్రవర్తన

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : నాగిరెడ్డిపేట్ మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి స్టయిల్ మహిళా ఉపాధ్యాయురాలను కించపరిచే విధంగా ఉందని పలువురు ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. మండల కేంద్రంలోని కేరళ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిని చితకబాదిన సంఘటనలో భాగంగా బుధవారం నాగిరెడ్డిపేట ఎంఈఓ భాస్కర్ రెడ్డి మండల కేంద్రంలోని శ్రీసాయి పబ్లిక్ స్కూల్లో మహిళా ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తూ తన స్టైల్, అందం, చందం చూడాలనిపించే విధంగా మహిళా ఉపాధ్యాయురాలను కించపరిచే విధంగా కాలు మీద కాలు వేసుకుని మహిళా ఉపాధ్యాయులను సైతం లెక్కచేయకుండా మర్యాద ఇవ్వకుండా తన స్టలే సపరేటు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తూ కించపరిచారని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఆరోపించారు. ఇప్పటికైనా మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి తన ప్రవర్తన మార్చుకోవాలని పలువురు సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఎంఈఓ భాస్కర్ రెడ్డి గత దసరా సెలవులకు ముందు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినీలతో ఓ వ్యాపార సంస్థకు సంబంధించిన సమావేశం నిర్వహించి, ఉపాధ్యాయినీలకు బహుమతులు అందజేయగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాధికారికి ఓ ఉపాధ్యాయ సంఘం నేతలు ఫిర్యాదు కూడా చేశారు.  గతంలో నాగిరెడ్డిపేట్ మండల ఎంఈఓలుగా ఎంతోమంది బాధ్యతలు నిర్వహించారు కానీ ఇలాంటి ఎంఈఓ భాస్కర్ రెడ్డిని చూడడం మొదటిసారని పలువురు విమర్శిస్తున్నారు.