. . . రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
నాగిరెడ్డి పేట్, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహశీల్దార్ శ్రీనివాస్ రావు ఏసీబీకి చిక్కారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఒక వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఎసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాండూర్ కు చెందిన వ్యక్తి సమస్య పరిష్కారం కోసం లంచం డిమాండ్ చేయగా బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
