వేం నరేందర్ రెడ్డిని కలిసిన నగేశ్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని శుక్రవారం నిజామాబాద్ జిల్లా , నగర అధ్యక్షులుగా ఎన్నికైన నగేశ్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వీరు వేం నరేందర్ రెడ్డిని సన్మానించారు. వీరి వెంట మాజీ ఎన్ఎస్ యూఐ , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గన్ రాజ్, పంచరెడ్డి చరణ్, తదితరలున్నారు.