సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన నగేశ్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డిని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ,నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేశ్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. రాష్ర్ట ప్రజల నమ్మకాన్ని నిజం చేసే సీఎంకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నగేశ్ రెడ్డి ఆకాంక్షించారు.