Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 7:39 pm Posted by : ramakrishna

నాగేంద్ర నగర్ ఉప సర్పంచ్ కు 2010-2011 ఎస్.ఎస్.సి బ్యాచ్ సన్మానం

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్‌ గ్రామానికి చెందిన షేక్ జాకీర్ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా తోటి మిత్రులైన 2010-2011 ఎస్‌.ఎస్‌.సి బ్యాచ్ కు చెందినవారు ఆయనకు శాలువాతో చిరు సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండలానికి చెందిన 2010-2011 బ్యాచ్ ఎస్‌.ఎస్‌.సి బ్యాచ్‌కు సంబంధించిన మిత్రులు ప్రెసిడెంట్ సుమన్, సెక్రటరీ రాజు, క్యాషియర్ అరుణ్, సలహాదారులు జైపాల్, నలిన్ తో పాటు 2010-2011 బ్యాచ్‌కు చెందిన సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.సి బ్యాచ్ సభ్యులు మాట్లాడుతూ మాతో పాటు చదివిన ప్రతి ఒక్కరు రాజకీయపరంగా జీవితంలో మంచి గుర్తింపు పొంది పదోన్నతులు సాధించి, ప్రజలకు సేవ చేసే బాధ్యతాయుతమైన పదవులు చేపట్టారని భవిష్యత్తులో తమ తోటి మిత్రులు రాజకీయపరంగా ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు సేవ చేసి ప్రజలచే గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.  నూతనంగా ఎన్నికైన మిత్రుడు ఉప సర్పంచ్ షేక్ జాకీర్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.