నాగారం పోలీసుల డ్రంక్ డ్రైవ్ టెస్టులు

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని నాగారం 5వ టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. 5వ టౌన్ పరిధిలోని గణేష్ కాలనీలో కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించారు. నిజామాబాద్ నార్త్ సిఐ శ్రీనివాస్ రాజ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి పది వాహనాలు సీజ్ చేశారు. పలు కేసులు నమోదు చేశారు. స్థానిక ఎస్సై గంగాధర్ తో కలిసి సిఐ కమ్యూనిటీ పోలీసింగ్ తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.