బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నాగ సురేష్
నందిపేట్, బతుకమ్మ: నందిపేట్‌కు చెందిన యువ నాయకుడు నాగ సురేష్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం ఆయన పేరును ప్రకటించింది. నందిపేట్ నుంచి తొలిసారిగా ఓ యువ నాయకుడికి ఈ బాధ్యత లభించడం విశేషం. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో చురుకుగా పనిచేసిన ఆయన, ఇంతకుముందు యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. ఈ సందర్భంగా నాగ సురేష్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేశ్...