. . . న్యాక్ లో ఎస్ఎస్ఆర్ కు బి ప్లస్ ప్లస్ గ్రేడ్ గుర్తింపు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
నిజామాబాద్ నగరం లో గత 32 సంవత్సరాలుగా డిగ్రీ విద్యార్ధులకు విద్యాబోదనలో బ్రాండ్ ఇమేజీ సాధించిన ఎస్ఎస్ఆర్ డీగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు లభించింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ఓక్క ఎస్ఎస్ఆర్ డీగ్రీ కాలేజ్ కు మాత్రమే న్యాక్ అక్రిడేటేడ్ బి ప్లస్ ప్లస్ గ్రేడ్ ను సాధించిందని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్ధల చైర్మెన్ డాక్టర్ యం . మారయ్య గౌడ్ తెలిపారు. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ మేరకు శనివారం న్యాక్ నుంచి ఎస్ఎస్ఆర్ కళాశాలకు న్యాక్ గుర్తింపులో గ్రేడ్ బి ప్లస్ ప్లస్ దక్కించుకుందని ఆన్లైన్ లో మేయిల్ వచ్చినట్లు తెలిపారు. ఈ నెల చివరిలో వారంలో న్యాక్ టీం సభ్యులు ఎస్ఎస్ఆర్ కళాశాలను సంధర్శించి విద్యా బోదన, వసతులు, విద్యార్ధులు, తల్లిధండ్రుల అభిప్రాయాలను సేకరించిందని తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం ఎడాధి క్రితం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగా న్యాక్ టీం సంధర్శించి వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా తమకు న్యాక్ గుర్తింపు లభించిందని తెలిపారు.
గత మూడు దశాబ్ధాలకు పైగా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలను విద్యార్ధులు, తల్లిధండ్రులు, ప్రజలు అధరించడం వలననే న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నం చేసి కళాశాలలో సకల సౌకర్యాలు ఎర్పాటు చేశామన్నారు. న్యాక్ గుర్తింపు కలిగిన ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఎస్ఎస్ఆర్ రేండవది అని తెలిపారు. ఓక్క గిరిరాజ్ కు మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గుర్తింపు ఉందని తెలిపారు. న్యాక్ గుర్తింపు కలిగిన డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్ధులకు భవిష్యత్తు భాగుంటుందని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కరస్పాండేంట్ యం. హరిత గౌడ్, డైరెక్టర్ యం. హర్షిత్ గౌడ్ తదితరులు ఉన్నారు.
