Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2024, 5:18 pm Posted by : ramakrishna

ఇంచార్జీ రెవిన్యూ ఆఫిసర్ నరేంధర్ ఆక్రమ ఆస్తులు రూ.6.07 కోట్లు

  • రూ.2.93 కోట్ల నోట్ల కట్టలే
  • బ్యాంకులో బ్యాలేన్స్ రూ.1.10 కోట్లు
  • స్థిరాస్తుల విలువ రూ.1.98 కోట్లు
  • నోట్ల కట్టలు లేక్కించడానికి మిషన్లతోనే గంటల సమయం
  • ఎసిబి చరిత్రలో ఉమ్మడి జిల్లాలో తోలిసారి కోట్ల ఆస్తులు ఉద్యోగి వద్ధ లభ్యం

బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఇంచార్జీ రెవిన్యూ ఆఫిసర్ దాసరి నరేంధర్ ఇంటిలో దోరికన ఆస్తులు చిట్టా,నోట్ల కట్టలను చూసి ఎసిబి అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. నెల రోజుల క్రితం అవినితి నిరోధక శాఖకు అందిన విశ్వసనీయ సమచారం మేరకు శుక్రవారం తెల్లవారు జామున నిజామాబాద్ ఎసిబి అధికారులు నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సూపరింటేండేంట్ దాసరి నరేంధర్ ఇంటిపై తెల్లవారు జామున దాడి చేశారు. ఆక్రమాస్తులు కుడ బేట్టారని వచ్చిన పిర్యాదు మేరకు నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లోని ఆశోక టవర్ లోని నరేందర్ ఇంటిలో, కోటగల్లిలోని మరో ఇంటిలో, నిర్మల్ లోని బందువుల ఇళ్లలో ఎకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాలలో మొత్తం లభించిన ఆస్థులు, నగధు, బంగారం విలువ రూ.రూ.6.07 కోట్లు గా గుర్తించారు.

n-charge revenue officer Narendhar's occupied assets are Rs.6.07 crores

ఇంట్లో నోట్ల కట్టల విలువనే రూ.2.93 కోట్లు గా తెలింది. రూ.500 నోట్ల కట్టలను లెక్కించాడానికి ఎసిబి అధికారులకు మని కౌంటింగ్ మేషన్ లను వాడారు. నోట్లను లెక్కించాడానికి సుమారు ఆరుగంటలకు పైగా సమయం పట్టింది. దాసరి నరేంధర్, అతని భార్య,తల్లి పేర్ల మీద వివిథ బ్యాంకు లలోని 7 అకౌంట్లలో రూ.1.10 కోట్లు నగధు ఉన్నట్లు అదారాలు లభించాయి. అతని ఇంటిలో 51 తులాల బంగారు అభరణాలను గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో ఇతర ప్రాంతాలలో 17 వివిధ ప్రాంతలాలోని స్థిరాస్థుల విలువ రూ..1.98 కోట్లు గా లెక్కించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తోలిసారి ఓక ఉద్యోగి వద్ధ ఆదాయానికి మించి అస్థులు కుడ బెట్టిన ఘటనలో అతి పెద్ధ కేసుగా ఎసిబి అధికారులు తెలుపుతున్నారు. మార్కేట్( రిజిస్ర్టేషన్) రేటు ప్రకారమే ఆస్థుల విలువ రూ.6.07 కోట్లు అని తెలింది కాని బహిరంగ మార్కేట్ లో దాని విలువ నాలుగింతలు ఉంటుందని సమాచారం.

నరేంధర్ కు తెలంగాణతో పాటు మహరాష్ర్టలోని బందువుల పేరుమీదా బినామి ఆస్తులు కోట్ల లో కుడా బెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి నరేందర్ ను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు.

n-charge revenue officer Narendhar's occupied assets are Rs.6.07 crores