- బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం
బతుకమ్మ, ఏర్గట్ల: మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం,మాజీ ఎంపీపీ కోలీప్యాక ఉపేందర్ రెడ్డి,మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి,కేటీఆర్ పై ఇస్టారీతిన అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి పైన చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇట్టి సందర్భంలో పూర్ణానందం, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన భిక్షతో రాజకీయంగా ఎదిగి, పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కేటీఆర్ పైన నోటికి వచ్చినట్లు,అరేయ్ తోరెయ్ అంటూ సంగతి చూస్తా అంటూ మాట్లాడుతున్న మైనంపల్లి హనుమంతరావు మీద చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.ఇలాంటి భాష మరోసారి ఇలాగే మాట్లాడితే తమదైన శైలిలో గుణపాఠం చెబుతామని మైనంపల్లి హనుమంతరావుని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజాపూర్ణానందo, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మండల బిఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపిటిసి డాక్టర్ మధు, ఏర్గట్ల గ్రామ శాఖ అధ్యక్షులు దేవుడునర్సయ్య, బట్టపూర్ అధ్యక్షుడు కూతురు చిన్న సాయన్న,అంజిరెడ్డి, లోలపు అశోక్,బద్దం హనుమాండ్లు,గడ్డం రమేష్ రెడ్డి, బద్దం ప్రభాకర్,కొలిపాక శ్రీనివాస్, పౌలింగ్, జైనుద్దీన్ ,వెంకట్ నాయక్,మేర తిరుపతి,శ్యామ్ రెడ్డి,రొక్కడ మోహన్,పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.