Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 6:21 pm Posted by : ramakrishna

అవినీతిరహిత మున్సిపల్ కార్పొరేషన్ ను తీర్చిదిద్దడమే నా బాధ్యత

 

. . . 60 డివిజన్లో బిజెపి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి రహిత ఇందూరుగా మార్చుకోండి

 

. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మన ఇందూరు.. మన మేయర్ నినాదంతో ప్రచారంలో ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ నీ ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందూరు ప్రజలు బిజెపి పార్టీకి మద్దతు పలికి ఓటు వేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. అలాగే అవినీతి రహిత నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను తీర్చిదిద్దడమే నా ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 60 డివిజన్లలో భాజపా పార్టీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను ఇందూరు ప్రజలు తమ ఓటు అనే ఆయుధం ద్వారా కమలం పువ్వుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అప్పటి ఎమ్మెల్యే కమిషన్లు కాంట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ ముసుగులో అర్బన్ నియోజకవర్గం లోని వేలాది కోట్ల రూపాయలు విలువచేసే భూములను అప్పటి ఎమ్మెల్యే తన అనుచరులు కబ్జా చేసి అక్రమ సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇక రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏవీ కూడా చేయలేని అసమర్ధత, 420 ప్రభుత్వమని విమర్శించారు. అలాగే 400 హామీలతో రాష్ట్రాన్ని మార్పు దశగా తీసుకువెళ్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి మార్పు చేయగానే అసమర్థత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అందుకే ఈ 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థాయిలో బిజెపి అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరవేద్దామని ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నారు.