అమ్మలా తోడుగా ఉన్నమన్నందుకు ..కన్నపేగు కదిలింది
జిల్లా జడ్జి భరత లక్ష్మీ నిజామాబాద్, బతుకమ్మ : బార్ అండ్ బెంచ్ సమన్వయంతో కలిసి వెళితే విజయాలు వెంటబడి వస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి.ఎన్ భరత లక్ష్మీ అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ జిల్లాకోర్టు ఆవరణలో నిర్వహించిన వార్షిక దినోత్సవం లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యనిర్వాహక వర్గపు అధిపతులు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు కమిషనర్ లు న్యాయపాలికలో పాలుపంచుకుంటున్న తీరు ఆదరణీయమని అన్నారు.జిల్లాకోర్టు ప్రాంగణంలో రెండు లిఫ్టులు పనిచేయడం లేదని వాటి స్థానంలో నూతన లిఫ్టులకుగాను...