జి.జి కళాశాలలో “మై భారత్ – నషాముక్త్ భారత్”
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, నిజామాబాద్ జిల్లా యువజన శాఖ, గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల సంయుక్తంగా జిల్లా స్థాయి "మై భారత్ – నషాముక్త్ భారత్" కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు క్రమశిక్షణ కలిగిన యువతపై ఆధారపడి ఉందన్నారు. యువత వ్యసనాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు....