Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:58 pm Posted by : ramakrishna

జి.జి కళాశాలలో “మై భారత్ – నషాముక్త్ భారత్”

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, నిజామాబాద్ జిల్లా యువజన శాఖ, గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల సంయుక్తంగా జిల్లా స్థాయి “మై భారత్ – నషాముక్త్ భారత్” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు క్రమశిక్షణ కలిగిన యువతపై ఆధారపడి ఉందన్నారు. యువత వ్యసనాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా యువజన అధికారి రమేశ్ మాట్లాడుతూ, యువతలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించేందుకు “మై భారత్” కార్యక్రమం కింద వివిధ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, ప్రసంగం, పోస్టర్ రూపకల్పన తదితర పోటీలు నిర్వహించామని తెలిపారు. విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి సత్కరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. రంగరత్నం, అకాడమిక్ కో-ఆర్డినేటర్ నహిదా బేగం, భరత్ రాజ్, పీఆర్‌ఓ దండు స్వామి, ఎన్‌సీసీ అధికారి రామస్వామి, రంజిత, రమేష్ గౌడ్, రాజేష్, వినయ్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు నరేష్ కుమార్, సుధాకర్, దస్తప్ప, రాము, జిల్లా క్రీడల అధికారి పవన్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ స్వప్న, బ్రహ్మకుమారీస్ మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.