నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దివంగత మాజీ జాతీయస్థాయి క్రీడాకారుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఏం వి సుబ్బారావు స్మారక నిజామాబాద్ అర్బన్ అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు సోమవారం స్థానిక డీఎస్ ఏ మైదానంలో నిజామాబాద్ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు అధ్యక్షులు అజ్మాత్ ఖాన్ తెలిపారు. ఈ పోటీలు డిసెంబర్ 01 నుంచి 4వరకు స్థానిక కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలో నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్ బాల్, అథ్లెటిక్స్, విభాగాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్, డీఈఓ అశోక్ కుమార్ తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు.