బతుకమ్మ, నందిపేట్ : నందిపేట మండలంలో పురాతన మందిరాలు అయిన శ్రీ ముత్యాలమ్మ, శ్రీ చిలుకల చిన్నమ్మ, శ్రీ పోచమ్మ ఆలయాల పునర్నిర్మాణంలో సహకరించిన దాతల పేర్లతో కూడిన శిలాఫలకాలను కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ రాములు మహారాజు శుక్రవారం ఆవిష్కరించారు. ఆలయ పునర్నిర్మాణంలో సహకరించిన దాతలందరికీ మహారాజు కృతజ్ఞతలు తెలిపారు. . ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వీడిసి సభ్యులు పాల్గొన్నారు.
