Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2024, 5:39 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాలకు ముత్యాల సునీల్ పరామర్శ

బతుకమ్మ, ఏర్గట్ల : మండలం తాళ్ళ రాంపూర్ గ్రామానికి చెందిన దిబ్బ అనిల్ అనే యువకుడు ఇటీవల జరిగిన (యాక్సిడెంట్) రోడ్డు ప్రమాదంలో కమ్మర్ పల్లి మండలం హస కొత్తూర్ వద్ద మరణించడం జరిగింది. శనివారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది.అలాగే అదే గ్రామానికి చెందిన శివరాత్రి గుండ్ల స్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవ రెడ్డి,బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగప్రసాద్,మాజీ సర్పంచ్ కోటగిరి రామా గౌడ్, మాజీ ఎంపీటీసీ దిబ్బ సుదర్శన్ ,బెజ్జారపు భాను, ఆవుల దేవన్న,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.