మెండోరా, బతుకమ్మ:మెండోరా మండలంలోని గ్రామాలలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మెండోర మండల కేంద్రానికి చెందిన సామ అన్వేష్ రెడ్డి ఇటీవల ఐర్లాండ్ లో గుండెపోటుతో మరణించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న వారి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అలాగే కోడిచర్ల గ్రామానికి చెందిన నూకల వెంకన్న ఇటీవల గుండెపోటుతో మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
