Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 5:12 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ 

కమ్మర్ పల్లి , బతుకమ్మ: మండలంలోని హాసకొత్తూరు గ్రామానికి చెందిన నాలుగు బాధిత కుటుంబాలను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మంగళ వారం పరామర్శించారు. ఇందులో భాగంగా పత్రి రాజేశ్వర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని, గంగారామ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని, ఇటీవలే అనారోగ్యంతో మరణించిన పెద్ది నిఖిల్ కుటుంబాన్ని, అనారోగ్యంతో మరణించిన పాలెపు లింగన్న కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Mutyala Sunil Kumar visited the affected families