ప్రజా పాలన దినోత్సవ వేడుకకు ముస్తాబైన కలెక్టరేట్
బతుకమ్మ, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవ వేడుకకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ముస్తాబైంది. మంగళవారం నిర్వహించనున్న ఈ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి ముఖ్య అతిథిగా ఉదయం 10.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా...