విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పని చేయాలి
జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ మాక్లూర్, బతుకమ్మ : విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆదేశించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో తరగతి గదులను సందర్శించారు. అధ్యాపకుల బోధన విధానం పై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్, అధ్యాపకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎవరు నిర్లక్ష్యం గా...