తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

రుద్రూర్ ఎస్సై పి.సాయన్న   రుద్రూర్, బతుకమ్మ : ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రుద్రూర్ ఎస్సై పి.సాయన్న సూచించారు. సీపీ ఆదేశాల మేరకు శనివారం రుద్రూర్ మండలం అంబం(ఆర్) గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద రుద్రూర్ పోలీసుల ఆధ్వర్యంలో    వాహనదారులకు రుద్రూర్ ఎస్సై పి.సాయన్న అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని సూచించారు. యువకులు అలైన్ బెట్టింగ్ లకు బానిసవుతున్నారని, డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అలాంటి చెడు అలవాటుకు యువత...