ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆర్.ఓలు, ఏ.ఆర్.ఓలకు పంచాయతీ ఎన్నికల  నిర్వహణ తీరుతెన్నులపై పునఃశ్చరణ కల్పించేందుకు శనివారం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుందని, నియమ, నిబంధనల గురించి...