వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
కామారెడ్డి, బతుకమ్మ: ఈ విద్యా సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గాంధారి మండలం పొతంగల్ కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతోపాటు ఆరోగ్య ఉప కేంద్రం, ఇందిమ్మ ఇళ్ల సర్వే, అంగన్ వాడీ కేంద్రం, గాంధారిలోని నర్సరీలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. పోతంగల్ కలాన్ హైస్కూల్ లోని కిచెన్ లో వంటలను, స్టోర్ రూమ్ లోని బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట ఆర్డీవో ప్రభాకర్, జిల్లా విద్య శాఖాధికారి రాజు, జిల్లా...