- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ అధికారులను ఆదేశించారు. జాతియ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తన కార్యాలయ చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యంగా సీజనల్ వ్యాధుల్లో భాగంగా డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నది, టీబి ముక్తభారత్ లో భాగంగా టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు, పరీక్షలు, చికిత్స, టీబి నిర్ధారణ పరీక్షలకై శాంపుల్స్ సేకరణ ప్రధానమైందని, అదేవిధంగా టీబీ వ్యాధిగ్రస్తులకు చికిత్స కూడా అత్యవసరమన్నారు. అర్హులైన చిన్నపిల్లలు, లబ్ధిదారులందరికీ వ్యాధి నిరోధక టీకాలు పూర్తిస్థాయిలో అందజేయాలని, ఎవరైనా ఎక్కడైనా డ్రాప్ అవుట్ ఉంటే వారిని వెంటనే గుర్తించి టీకాలు అందజేయాలన్నారు. మదర్ ఇన్ మదర్ అవుట్ వారిని ఫోన్ సమాచారం ద్వారా అక్కడివారికి తెలియజేసి లేదా ఫోన్ ద్వారా తెలుసుకొని వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల కోసం నూతన భవనాల నిర్మాణానికై అనువైన స్థలాన్ని కేటాయించేలా స్థానిక గ్రామాభివృద్ధి కమిటీలు లేదా రెవిన్యూ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్మాణం పూర్తి అయిన పల్లె దావకానాలను ప్రారంభించడానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మార్పు సిబ్బంది ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన కేంద్రాల్లో సమయపాలన పాటిస్తూ ప్రసవాల కోసం వచ్చే గర్భిణీ స్త్రీలకు అన్ని రకాల సేవలు అందించాలని సూచించారు. రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పాఠశాలలను సందర్శించే ఆర్ బి ఎస్ కే టీం లను డిప్యూటీ డిఎంహెచ్వోలు వారి హాజరును, క్షేత్రస్థాయిలో వారిని పర్యవేక్షించాలని తెలియజేశారు. అదేవిధంగా వైద్య సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ రమేష్, డాక్టర్ సమతా, డాక్టర్ అశ్విని, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ తుకారం రాథోడ్, డాక్టర్ రాజు, డాక్టర్ అశోక్, డాక్టర్ శ్రావ్య, మరియు ఫార్మసి అధికారి నారాయణ,డిపిఓ విశాల, డి హెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు రిపోర్టింగ్ అధికారులు పాల్గొన్నారు.
