Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 7:59 pm Posted by : ramakrishna

కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలి

 

. . . హెచ్ఎంఐఎస్ పై వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఏఎన్ఎం లు అందరూ ప్రతిరోజు సమయపాలన పాటించాలని, కేంద్రాల వారిగా కేటాయించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలని ఆరోగ్య, వైద్య శాఖాధికారిని డా.బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు గురువారం హెచ్ఎంఐఎస్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఏఎన్ఎంలు రోజు వారి వీధుల్లో అందించే వైద్య ఆరోగ్య సేవలను ముఖ్యంగా గర్భిణీ స్త్రీల నమోదు, హాస్పిటల్లో జరిగిన ప్రసవాలు, వ్యాధి నిరోధక టీకాలు, మాతా శిశు మరణాలు, జీవనశైలి వ్యాధులపై చేస్తున్నటువంటి నిర్ధారణ పరీక్షలు మొదలగు వైద్య సేవలు అన్నింటిని హెల్త్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం లో ఎంటర్ చేయాలన్నారు. డిడిఎం నారాయణ, హెచ్ ఈ ఓ శ్రీనివాస్ ఏఎన్ఎంలకు ప్రత్యేక సూచనలు అందజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ కి చెందిన పిహెచ్.సిల ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

 

Must complete assigned goals