పోలింగ్ విధులపై పూర్తి కలిగి ఉండాలి

నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 17న జరిగే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల  పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. ముప్కాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణ విధులపై మాస్టర్ ట్రైనర్ చే అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులు సందర్శించిన సందర్భంగా కలెక్టర్ పీవోలకు కీలక సూచనలు చేశారు. హ్యాండ్...