Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2025, 8:57 pm Posted by : ramakrishna

విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలి

  • కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ
  • నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ  

 

బతుకమ్మ, నాగిరెడ్డిపేట : పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు. బుధవారం నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను ఎల్లారెడ్డి డీఎస్సీ శ్రీనివాసులు, సిఐ రవీందర్ నాయక్, స్థానిక ఎస్ఐలను అడిగి తెలుసుకుని, పెనికిలో ఉన్న కేసులపై రివ్యూ నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని , ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని సూచించారు.  పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండాలని, ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్నివిభాగాలు  తిరిగి క్షుణ్నంగా పరిశీలించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆక్సిడెంట్ జోన్ లుగా,  బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి  తీసుకొని రావాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ. రవీందర్ నాయక్, ఎస్సై మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.