పదో తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించాలి
బీబీపేట ఉన్నత పాఠశాలను సందర్శించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బతుకమ్మ, మాచారెడ్డి: పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉపాధ్యాయులకు సూచించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( తిమ్మయ్య గారి నారాయణరెడ్డి సుశీల స్కూల్) ను ఆయన శుక్రవారం సందర్శించారు. స్కూల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ లను పరిశీలించారు. టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన కల్పించారు...