నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రంజాన్ పండుగ వేళ వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా సోమవారం ముస్లింలు తమ చేతికి నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలలో నల్ల రిబ్బన్ లు ధరించి నమాజ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు 2024 పార్లమెంటులో ప్రవేశపెడుతున్ననేపథ్యంలో బిల్లుకు అడ్డుకోవాలని అన్నారు. అది ఆమోదం పొందితే ముస్లీం సమాజానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.