మహిళలపై జరుగుతున్న హత్యలు అరికట్టాలి
ఐద్వ జిల్లా కార్యదర్శి సుజాత నవీపేట్, బతుకమ్మ : మహిళలపై జరుగుతున్న హత్యలను అరికట్టాలని ఐద్వ జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. నవపేట్ మండలంలో ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వ జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆకుల అనంత సోనీ అనే మహిళను హత్య చేసి పారిపోయిన పాండవుల సాగరను కఠినంగా శిక్షించాలన్నారు. జిల్లాలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. చట్టాలను అమలు చేయకపోవడం, విచ్చలవిడిగా మద్యం...