Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 6:30 pm Posted by : ramakrishna

మహిళలపై జరుగుతున్న హత్యలు అరికట్టాలి

  • ఐద్వ జిల్లా కార్యదర్శి సుజాత

 

నవీపేట్, బతుకమ్మ : మహిళలపై జరుగుతున్న హత్యలను అరికట్టాలని ఐద్వ జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. నవపేట్ మండలంలో ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వ జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆకుల అనంత సోనీ  అనే మహిళను హత్య చేసి పారిపోయిన పాండవుల సాగరను కఠినంగా శిక్షించాలన్నారు. జిల్లాలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. చట్టాలను అమలు చేయకపోవడం, విచ్చలవిడిగా మద్యం విక్రయించడం అన్నారు. ఏ హత్య కేసులైనా హత్యాచారం కేసులైన మనం పరిశీలించినట్లయితే. మద్యం మత్తులో చేసినవే  ఉంటాయన్నారు.  మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా చట్టాలను బలపరచాలన్నారు. విచ్చలవిడిగా మధ్యమ అమ్మకాలను ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో  ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా  మండల కార్యదర్శి నాయకుడు రమ,  మండల అధ్యక్షురాలు  కొండపల్లి పుష్ప, మండల కమిటీ సభ్యులు గంగమణి, విజయ పాల్గొన్నారు.