Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 7:47 pm Posted by : ramakrishna

రన్నింగ్ ట్రైన్ లో  మర్డర్

. . . ధర్మాబాద్ – కరికెల్లి మధ్య ఘటన

. . . గాయపడ్డ వ్యక్తిని రైలులో నిజామాబాద్ కు తరలింపు

. . .  పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు దృవీకరణ

. . . నిజామాబాద్ జీరో ఎఫ్ఐఆర్ . . . డెడ్ బాడి నాందేడ్ కు తరలింపు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

కదులుతున్న రైలులో  ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది.  మహారాష్ట్రలోని కరికెల్లి – ధర్మాబాద్ మధ్య అకోలా- కాచిగూడ ఇంటర్ సిటి రైలు లో ఈ ఘటన జరిగింది. నాందేడ్ జిల్లా ఉమ్రి గ్రామానికి చెందిన అతిశ్ (40) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ని అతనితో పాటు ప్రయాణిస్తున్న షేక్ జమీర్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. అతిష్ వాటర్ బాటిళ్లు రైలులో అమ్ముతున్న సమయంలో జమీర్ గొడవపడి బాటిల్ (సీసా)ను పగులగొట్టి నడుము కిందిభాగంలో, తోడపై పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అదే రైలులో అతడిని నిజామాబాద్ కు తరలించారు. రైల్వైస్టేషన్ కు డాక్టర్ ను పిలిపించి అతిష్ ను పరీక్షించగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి జీరో ఎఫ్ఐఆర్ చేసినట్లు తెలిపారు. హత్య జరిగిన సంఘటన స్థలం మహారాష్ట్రలో ఉండడంతో డెడ్ బాడిని నాందేడ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.