Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 6:01 pm Posted by : ramakrishna

కదులుతున్న రైలులో మర్డర్

 

. . . ధర్మబాద్ – నిజామాబాద్ మధ్యలో ఘటన

. . . ఆస్పత్రికి తరలించే సరికి గుర్తు తెలియని వ్యక్తి మృతి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

కదులుతున్న రైలులో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది.  మహారాష్ట్రలోని అకోలా- కాచిగూడ ఇంటర్ సిటి రైలు లో ఈ ఘటన జరిగింది. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ నుంచి నిజామాబాద్ రైల్వే స్టేషన్ మధ్యలో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ( 45) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ని అతనితో పాటు ప్రయాణిస్తున్న వ్యక్తి కత్తితో పొడిచాడు. అతడిని రైలులోనే నిజామాబాద్ కు తరలించారు. అతడిని అంబులెన్స్ లో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. నిజామాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. హత్యకు గల కారణాలు  పరిశీలిస్తున్నారు.  హతుడి ఆచూకీ  నాందేడ్ జిల్లా ఉమ్రికి చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా నిర్ధారించారు.. పోలీసులు కోణంలో విచారణ జరుపుతున్నారు.