నందిపేటలో హత్యాయత్నం…
గాయాలతో కుప్పకూలిన బాధితుడు నందిపేట, బతుకమ్మ : నందిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న బస్ డిపో ఆవరణలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. నందిపేట్ ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం… కల్లు డిపోలో మద్యం సేవిస్తున్న ఏడుకొండ రమేష్‌కు గుర్తుతెలియని వ్యక్తులతో ఘర్షణ జరిగింది. ఆ తర్వాత బస్ ఖాళీ జాగా లో దుండగులు అతనిపై రోకలిబండలతో దాడి చేసి తల భాగంలో, గొంతు వద్ద తీవ్ర గాయాలు కలిగించారు. గాయాలతో అపస్మారక...