Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 6:40 pm Posted by : ramakrishna

హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాలు కఠిన కారాగారా జైలు శిక్ష

 

. . . పదివేల రూపాయలు జరిమానా

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ నిజామాబాద్ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెండోరా మండలం దూద్‌గావ్ గ్రామానికి చెందిన ఫిర్యాదిదారు భాగ్యవతి నివాసానికి ఎదురుగా నిందితుడు బుచ్చన్న ఇంటి ముందు ఉన్న వేపచెట్టు విషయంలో గత నాలుగు సంవత్సరాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 2, 2022 న ఉదయం ఫిర్యాదిదారి కుమారుడు వసంత్‌తో నిందితుడు గొడవకు దిగాడు. చంపాలనే ఉద్దేశంతో అతని తలను పట్టుకుని గోడకు మూడుసార్లు బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలకు చికిత్స పొందుతూ బాధితుడు అనంతరం మరణించాడు. అంత్యక్రియల అనంతరం బంధువులు జరిగిన విషయాన్ని తెలుసుకొని అదే రోజు మెండోరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ గోవర్ధన్ రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి, సమగ్ర ఆధారాలను సేకరించి కోర్టులో చార్జ్‌ షీట్ దాఖలు చేశారు. విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నేరం రుజువైంది. 1 వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, నిజామాబాద్‌ హరీష్ సమర్థవంతంగా వాదనలు విని వాటిని పరిగణనలోకి తీసుకొని నేరము రుజువయినందున నిందితుడు బుచ్చన్నకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో నేరస్థుడికి శిక్ష పడడానికి కృషి చేసినటువంటి బి.గోవర్ధన్ రెడ్డి సిఐ ఆర్మూర్ రూరల్ (అప్పటి), జాన్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సి.ఐ (ఇప్పటి) అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.నర్సింహా రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ గోవింద్ ఎస్సై, సిహెచ్ మురళి ధర్ రాజు ఏఎస్ఐ, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ఎం.విషన్ గౌడ్ కానిస్టేబుల్ , ఎన్.లక్ష్మణ్ కానిస్టేబుల్ , ఎస్.రాజు కానిస్టేబుల్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ అభినందిస్తూ ప్రశంసించారు.