స్వగ్రామంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన ముప్ప
మోపాల్, బతుకమ్మ: నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తన స్వగ్రామమైన మోపాల్ మండలం ముదక్ పల్లిలో సన్నబియ్యం పంపిణీని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ సన్న బియ్యం పంపిణీ చేపడుతూ పేదల పక్షాన నిలిచారన్నారు.