Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2025, 9:17 pm Posted by : ramakrishna

బీజేపీలో చేరిన ముప్కాల్ బీఆర్ఎస్ అధ్యక్షులు

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ అరవింద్

 

బాల్కొండ, బతుకమ్మ : ముప్కాల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ముస్కు భూమేశ్వర్, తాజా మాజీ ఎంపీపీ భర్త లింగా గౌడ్ తమ అనుచరులతో శుక్రవారం ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎంపీ అరవింద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Mupkal BRS president joins BJP