Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 4:13 pm Posted by : ramakrishna

ఇతరులకు సాయం చేసే గొప్ప మనసున్న మున్నూరు కాపులు

  • రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్
  • మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్

బిచ్కుంద, బతుకమ్మ : మున్నూరు కాపులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తూ ఇతరులకు సాయం చేసే గుణం ఉన్న గొప్ప మనసున్న మున్నూరు కాపులని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో సోమవారం నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులు విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని సమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో మామిడ్ల అంజయ్య , జిల్లా కామారెడ్డి అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ , ఉగ్గె శ్రీనివాస్ ,బండివార్ విజయ్ , ప్రదీప్ , వినోద్ , మాజీ జిల్లా పరిషత్ ఛైర్మెన్ రాజు కాసుల రోహిత్ , జెడ్పీటీసీ రాజు , నాగనాథ్ , విజయ్ సోపాన్ సార్ ,తదితరులు నాయకులూ పాల్గొన్నారు.

Munnuru Kapulu has a great heart to help others