మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి : టియూసీఐ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కమీషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లలో, 128 మున్సిపాలిటీలలో సుమారు 65 వేల మంది కార్మికులు శానిటేషన్, ఇతర పనులు చేస్తున్నారన్నారు. వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా...