మున్సిపల్ కార్మికులకు ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వాలి
ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్ బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ లో మున్సిపల్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల కు1 తేదీన వేతనాలు ఇవ్వాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ చాలీచాలి వేతనాలతో సతమవుతున్న మున్సిపల్ కార్మికులకు 14 రోజులుగా వస్తున్న వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు ఎంతమంది కమీషనర్లు వచ్చిన కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని ఆయన అన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలన్న...